పోలీసులు, భద్రతాధికారుల మధ్య ఈ అంతిమ వీడ్కోలు జరిగింది. ఈ సందర్భంగా డౌండియాల్ భార్య నికిత.. భర్తకు చివరి సారిగా ముద్దుపెట్టి.. ఐలవ్యూ అని చెప్పి, ఘన నివాళి అర్పించారు.
మేజర్ డౌండియాల్, నికితల వివాహం గతేడాది జరిగింది. తొలి వివాహ వార్షికోత్సవం నాటికి సెలవు తీసుకుని ఇంటికి వస్తానని భార్యతో డౌండియాల్ చెప్పారు. కానీ మేజర్ పార్థివ దేహం భార్య కళ్ల ముందుకు రావడంతో.. ఆమె చలించిపోయారు.
దీంతో నికిత.. డౌండియాల్ భౌతిక కాయం పక్కనే కూర్చొని తుదిసారి ముద్దు పెట్టుకుని.. ఐలవ్యూ అంటూ కన్నీటి వీడ్కోలు పలికారు. జై హింద్, వందేమాతరం అంటూ భావోద్వేగంతో సెల్యూట్ చేశారు. భర్త త్యాగం తనను గర్వపడేలా చేసిందన్నారు. ఈ హృదయ విదారక దృశ్యాన్ని చూసిన అక్కడి వారు చలించిపోయారు.