బిగ్ బి పుట్టిన రోజునే "కౌన్ బనేగా కరోడ్‌పతి" ప్రారంభం
File
FILE
టెలివిజన్ ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రముఖ రియాల్టీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఇది వరకు సోనీ టెలివిజన్ ఛానెల్ బాలీవుడ్ ఎవర్గ్రీన్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా నిర్వహించి టెలివిజన్ ప్రేక్షకులలో అత్యంత ప్రాచుర్యం పొందిన "కౌన్ బనేగా కరోడ్‌పతి" అనే రియాల్టీ షో తిరిగి ప్రారంభం కానుంది. ఈ సీజన్-4 ప్రోగ్రామ్‌కు కూడా "బిగ్ బి"నే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని అమితాబ్ పుట్టిన రోజైన అక్టోబర్ 11న ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ కెబిసి సీజన్-4 ప్రైజ్ మనీ ఎంతో తెల్సా.. అక్షరాల ఐదు కోట్ల రూపాయలు. ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ.. ఇది వరకు నిర్వహించిన షో మాదిరిగానే ఇది కూడా ఉంటుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అడిగే మొదటి 12 ప్రశ్నలకు ప్రైజ్ మనీ ఒక కోటి రూపాయలు, చివరి ప్రశ్నకు మాత్రం రూ. 5 కోట్లు. ఇందులో ఓ ప్రత్యేక లైఫ్ లైన్ "ఆస్క్ యాన్ ఎక్స్పెర్ట్" (నిపుణులను అడుగు)ను పరిచయం చేయనున్నారు. మిగిలిన రెండు లైఫ్ లైన్లలో ఎలాంటి మార్పు ఉండదు.
"ఆడియన్స్ పోల్" (ప్రేక్షకుల ఎన్నిక), "ఆస్క్ ఏ ఫ్రెండ్" (స్నేహితుడిని అడుగు)లో మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా యధావిధిగానే ఉంటాయి. ఇదివరకు ఉన్న 50:50 లైఫ్ లైన్‌ను మాత్రం ఈ ప్రోగ్రామ్ నుంచి తొలగించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందు దేశవ్యాప్తంగానే గాక ప్రపంచంలోని బిగ్ బి అభిమానులు సైతం "కోటి" కళ్లతో వేచి చూస్తున్నారు.