చిదంబరం బడ్జెట్ 2013 14 : మొబైల్ ఫోన్ కొనుగోలుదారులకు షాక్

గురువారం, 28 ఫిబ్రవరి 2013 (17:27 IST)
WD
కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం మొబైల్ కొనుగోలుదార్లకు గట్టి షాకిచ్చారు. అన్ని రకాల కొత్త మొబైల్స్‌పై సేవా పన్నును ఏకంగా ఆరు శాతం పెంచారు. ఫలితంగా రెండు వేల రూపాయలకు పైగా ధర కలిగిన మొబైల్స్ ఫోన్లు మరింత ప్రియం కానున్నాయి. ఈ పెరిగిన ధర ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలుకు రానుంది.

అలాగే, సిగరెట్లు, ఏసీ రెస్టారెంట్లలో విందులు మరింత భారం కానున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సెటాఫ్ బాక్సులపై డ్యూటీ సుంకాన్ని పెంచారు. అయితే అన్ని రకాల నాన్ ఏసీ రెస్టారెంట్లలో సేవా పన్నును పూర్తిగా తొలగించారు. సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీని 18 శాతానికి పెంచారు. ఎడ్యుకేషన్ సెస్‌ను యధావిధిగా కొనసాగించారు.

వెబ్దునియా పై చదవండి