మద్యం సేవించే మహిళల్లో గర్భం ధరించే ఛాన్స్ లేదా?

శుక్రవారం, 7 జులై 2023 (17:06 IST)
ప్రస్తుత కాలంలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా మద్యం సేవిస్తున్నారు. ముఖ్యంగా, అమ్మాయిల నుంచి మహిళల వరకు మద్యానికి బానిసవుతున్నారు. అయితే, మహిళలు మద్యం సేవిస్తే పిల్లలు పుట్టరనే ప్రచారం సాగుతోంది. ఇందులో వాస్తవమెంతో తెలియదు. ఇదే అంశంపై కొన్ని సంస్థలు నిర్వహించిన సర్వేల్లో తేలిన ఫలితాలను విశ్లేషిస్తే... 
 
సాధారణంగా మద్యం సేవించే ఆడవారిలో ఈస్ట్రోజన్, ప్రోజెస్టిరాన్ హార్మోన్‌లపై విపరీతమైన ప్రభావం పడుతుంది. ఇది మహిళలలో గర్భధారణ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని గైనకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. మద్యం తక్కువ మోతాదులు తీసుకునే మహిళల్లో అయితే, ఈ  సమస్య ఉత్పన్నం కాదని అంటున్నారు. అయితే, వారంలో 14 సార్లు అంటే రోజుకు రెండు సార్లు చొప్పున మద్యం సేవించే మహిళల్లో మాత్రం 25 శాతం గర్భం దాల్చే అవకాశాలు తగ్గిపోతాయని తేలిందని సర్వే ఫలితాలు వెల్లడించాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు