రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఓ కానుక ఇచ్చింది. మహిళా సాధికారతే లక్ష్యంగా కొత్త సామాజిక మాధ్యమ వేదికను ప్రారంభించారు. హెర్ సర్కిల్‌గా దానికి నామకరణం చేశారు.
కేవలం మహిళలకు సంబంధిత విషయాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. ఫ్యాషన్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, బ్యూటీ, ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించిన ఆర్టికల్స్‌ను చదవడంతో పాటు సంబంధిత వీడియోలనూ ఈ వేదిక ద్వారా వీక్షించొచ్చు. అవసరమైతే హెల్త్, వెల్‌నెస్, ఎడ్యుకేషన్‌కు, ఫైనాన్స్, లీడర్‌షిప్, మెంటార్ షిప్ వంటి విషయాల్లో రిలయన్స్ ప్యానెల్ నిపుణులు సమాధానాలు కూడా ఇస్తారు.
తన జీవితంలో ఎన్నో నేర్చుకున్నానని, వాటన్నింటినీ ఇతరులకు పంచుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని ప్రారంభించినట్లు నీతా అంబానీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అలాగే మహిళలంతా హెర్ సర్కిల్.ఇన్‌లో చేరి ఇతరులతో తమ ఆలోచనలను పంచుకోవాలని సూచించారు. మహిళల కోసం ఒక సామాజిక మాధ్యమ వేదికను తీసుకురావడం సంతోషంగా ఉందని అన్నారు.