తమ ఫ్యామిలీ డాక్టర్ వద్దకు వెళ్లి శ్వాస తీసుకోలేకపోతున్నాని చెప్పి బాధపడింది. అక్కడి నుంచి స్థానికంగా ఉండే ఓ ఆస్పత్రిలో చేరింది సెల్వా. గుండె పరీక్షలు చేస్తే రిపోర్టులో సంచలన విషయం బయటపడింది. ఆమెకు తీవ్రమైన హార్ట్ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. హార్ట్ ఫెయిల్యూర్ సమస్య ఉన్నందున సెల్వా హుస్సేన్‌ను ప్రపంచ ప్రఖ్యాత హేర్‌ఫీల్డ్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు.
ఆమె ప్రాణాలను కాపాడేందుకు కార్డియాలజిస్ట్‌లు ఎంతో శ్రమించారు. చివరకు ఆమె గుండె పనిచేయదని నిర్ధారణకు వచ్చి.. కృత్రిమ గుండెను అమర్చాలని నిర్ణయించారు. సెల్వా హస్సేన్‌తో పాటు ఆమె భర్త అంగీకారం తీసుకున్న తర్వాత.. ఆపరేషన్‌కు అంతా సిద్ధం చేశారు. అనంతరం సెల్వా శరీరం నుంచి గుండెను తొలగించి కృత్రిమ హృదయాన్ని అమర్చారు.
కృత్రిమ గుండెను ఓ బ్యాగ్‌లో సెటప్ చేశారు లండన్ డాక్టర్టు. అందులో రెండు బ్యాటరీలు, మోటార్, పంప్ ఉంటాయి. దాని నుంచి రెండు పైపులు ఆమె ఛాతీ భాగం నుంచి శరీరం లోపలికి వెళ్తాయి. బ్యాగ్‌లో ఉన్న మోటార్ సాయంతో శరీరం లోపల ఉన్న రెండు బెలూన్లకు నిరంతరం గాలిని పంప్ చేస్తుండాలి. ఆ రెండు బెలూన్లు గుండె చాంబర్లుగా పనిచేస్తాయి. అక్కడి నుంచే రక్తం శరీరంలోని ఇతర భాగాలకు పంప్ అవుతుంది. ఇలా కృత్రిమ గుండెను నిమిషానికి 138 సార్లు కొట్టుకునేలా సెట్ చేశారు.
నిరంతర పంపింగ్ కారణంగా ఆ మోటర్ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. అందుకే సెల్వా బ్యాక్‌ప్యాక్ నుంచి మోటార్ శబ్ధం వినిపిస్తూనే ఉంది. బ్యాటరీల్లో చార్జింగ్ అయిపోతే వెంటనే మార్చేయాలి. అది కూడా 90 సెకన్లలోనే మార్చేయాలి. లేదంటే పంపింగ్ ఆగిపోయి.. శరీరానికి రక్త సరఫరా నిలిచిపోతోంది. అందుకే ఆమె వెంట ఎప్పుడూ రెండు బ్యాటరీలు ఉంటాయి. ఒకటి అయిపోగానే.. మరొక దానిని కనెక్ట్ చేస్తుంది. ఆ సమయంలో రెండో దానికి చార్జింగ్ పెడుతుంది. సెల్వా హుస్సేన్ ఎక్కడికి వెళ్లినా ఆమెతో పాటే బ్యాగ్ తీసుకెళ్తుంది. అంతేకాదు సెల్వా భర్త ఏఐ కూడా అనుక్షణం ఆమె వెంటనే ఉంటారు.
ఇంతకు ఈ ఆర్టిఫిషియల్ హార్ట్‌కు ఎంత ఖర్చయిందో తెలుసా..? 86,000 యూరోలు.. అంటే మన కరెన్సీలో రూ.78 లక్షలు. ఇది కేవలం కృత్రిమ గుండెకు అయిన ఖర్చు మాత్రమే. ఆపరేషన్, ఇతర ఖర్చులు అదనం.