ప్రకృతికి ఎసిడిటీ.. ఆమ్ల వర్షం షురూ...

శాస్త్రీయ గణాంకాల ప్రకారం శుద్ధ జలం 298కె వద్ద 7 PH కలిగి ఉంటుంది. అయితే ఈ శుద్ధ జలాన్ని ఉత్పత్తి చేయడం అంత సామాన్యం కాదు. నీటి ఆవిరిగా నింగికెగసిన మరుక్షణం ఇది గాలిలోని కార్బన్ డై ఆక్సైడుతో కలిసి ఆమ్ల గుణాన్ని సంతరించుకుంటుంది.
WD

ఫలితంగా మేఘాలు కార్బన్ డై ఆక్సైడ్‌తో కూడిన ఆమ్ల వర్షాన్ని భూమిపై వదులుతాయి. ఈ కార్బన్ డై ఆక్సైడ్‌తోపాటు నైట్రోజన్, సల్ఫర్ ఆక్సైడ్‌లు కూడా కలిస్తే ఇక అది యాసిడ్ లా మారిపోతుందట. ఆ వర్షంలో తడిస్తే శరీరంపై యాసిడ్ పోసినప్పుడు కలిగే దుష్ప్రభావాన్నే ఇది కలుగజేస్తోందట.

ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా నెలకొల్పుతున్న పరిశ్రమలు ఈ అవకాశాలను పెంచి పోషిస్తున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

భవిష్యత్తులో పొంచి ఉన్న ఆమ్ల వర్షాల ప్రమాదం నుంచి బయట పడాలంటే తక్షణం ఈ దిశగా ప్రపంచంలోని దేశాలన్నీ కలిసికట్టుగా ఇప్పటినుంచైనా ప్రయత్నాలు మొదలుపెట్టాలంటున్నారు. లేదంటే... భావి తరాలకు ఆరోగ్యకరమైన నీటికి బదులు ప్రాణాలు తీసే జలాన్ని ప్రసాదించినవారమవుతామని అంటున్నారు.