కటి చక్రాసనంతో అదనపు కొవ్వు మాయం

కటి అంటే కృశోధరము లేదా నడుము. కటిని తిప్పే ఈ ఆసనాన్ని కటి చక్రాసనం అంటారు. దీని వలన శరీరానికి చాలా మేలు జరుగుతుంది.

ఆసనం వేయు పద్దతి
చదునైన నేలపై నిటారుగా నిలబడాలి.
తల వెనుకభాగం సమాంతరంగా ఉండేలా చూడాలి.
చూపు ఎదురుగా ఉండాలి.
చేతులను ముందుకు చాపాలి.
అలాగే కాళ్ళ మధ్య కనీసం అరమీటరు దూరం ఉండేలా చూడాలి.
ఎడమ చేతిని కుడి భుజంపైకి తీసుకురావాలి. కుడిభుజాన్ని వెనుకకు మడవాలి.
అలాగే కుడిచేతిని ఎడమ భుజంపైకి తీసుకువస్తూ ఎడమ భుజాన్ని వెనుకకు మడవాలి.
కుడి భుజంపై నుంచి వీలైనంత వరకు చూడాలి.
ఈ స్థితిలో కొన్ని సెకనులు నిలబడాలి. ఇలాగే కొద్దసేపు నిలబడిన తరువాత పూర్వస్థితికి రావాలి.
ఇదే విధంగా రెండోవైపు చేయాలి. ఇలా కనీసం 5 మార్లు చేయాలి.
WD
జాగ్రత్తల
భుజం, కృశోధరం నొప్పి ఉన్నవారు ఈ ఆసనాన్ని వేయకపోవడం మంచిది.

ఉపయోగాలు
ఈ ఆసనం వలన తొడలు, నడుము, తుంటలలోని అదనపు కొవ్వును తొలగిస్తుంది.

వెబ్దునియా పై చదవండి