20-09-2021 సోమవారం రాశిఫలాలు - శంకరుడిని పూజించినా మనోసిద్ధి...

సోమవారం, 20 సెప్టెంబరు 2021 (04:00 IST)
మేషం : ఉద్యోగస్తులు పదోన్నతి కోసం చేసే యత్నాలు కొంతవరకు సఫలమవుతాయి. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు పెరుగుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మెళకువ అవసరం. సంఘంలో మీ స్థాయి పెరుగుతుంది. వ్యాపారంలో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. 
 
వృషభం : కొంతమంది మీ సహాయం పొంది మిమ్మల్ని తక్కువ అంచనా వేయడం వల్ల ఆందోళనకు గురవుతారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పూర్తిచేస్తారు. స్త్రీలకు తల, నరాలు, కాళ్లకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. 
 
మిథునం : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. పెద్దల ఆరోగ్యంలో మెళకువ వహించండి. విద్యార్థులు వేడుకలలో ఉత్సాహాన్ని కనపరుస్తారు. మీ భావాలు, అభిప్రాయాలకు ఎదుటివారు విలువనిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకున్నదొకటి, జరిగేది మరొకటి అయ్యే అవకాశాలున్నాయి. 
 
కర్కాటకం : బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. చిన్ననాటి వ్యక్తులను కలుసుకుంటారు. మీ ప్రమేయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. నగదు, వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. 
 
సింహం : కాలంతో పోటీపడి పనిచేస్తారు. ఉపాధ్యాయులు విద్యార్థుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మిమ్మలను చూసి అసూయపడేవారు అధికమవుతారు. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. మీ శక్తి సామర్థ్యాలపై నమ్మకం పెంచుకుంటారు. 
 
కన్య : ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. కోర్టు వ్యవహారాలలో వాయిదాపడుట మంచిదని గమనించండి. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కుటుంబంలో కలతలు, చికాకులు నిదానంగా సర్దుకుంటాయి. ఉపాధ్యాయులు బహుమతులు అందుకుంటారు. 
 
తుల : ఐరన్, ఆటోమొబైల్, ట్రాన్స్‌పోర్ట్, మెకానికల్ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. కొత్త పరిచయాలు మీ ఉన్నతికి నాందిపలుకుతాయి. ఉపాధ్యాయులకు కార్యక్రమాలలో ఒత్తిడి అధికమవుతుంది. దంపతుల మధ్య సఖ్యతా లోపం. పట్టింపులు చోటు చేసుకుంటాయి. వ్యాపార వ్యవహారాల్లో ఖచ్చితంగా మెలగండి. 
 
వృశ్చికం : ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు, పనులు వాయిదా వేస్తారు. వృత్తి వ్యాపారాల్లో శారీరకంగా, మానసికంగా శ్రమిస్తారు. విదేశీయాన వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్త్రీల అభిప్రాయాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. యోగా ఆధ్యాత్మికతలపై ఆసక్తి పెరుగుతుంది. 
 
ధనస్సు : స్వార్థపూరిత ప్రయోజనాలు ఆశించి మీకు చేరువవ్వాలని భావిస్తున్న వారిని దూరంగా ఉంచండి. సోదరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాలు, మధ్యవర్తిత్వాలకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత ముఖ్యం. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. 
 
మకరం : ప్రతికూల వాతావరణంలో అనుకూల ఫలితాలు సాధించడానికి యత్నిస్తారు. ఇతరులు మిమ్మల్ని సలహాలు, సూచనలు కోరుతారు. అన్ని విషయాల్లో మరింతగా రాణిస్తారు. నిర్మాణ పనుల్లో వేగం కనపడుతుంది. సంతానపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు మేలు చేకూరుస్తారు. విందులలో పరిమితి పాటించండి. 
 
కుంభం : పొదుపై దృష్టి కేంద్రీకరిస్తారు. సంతానపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు మేలు చేకూరుస్తారు. మీ కుటుంబ విషయంలో ఇతరుల జోక్యం మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. సాంకేతిక, వైద్య రంగాల్లోని వారికి అనుకూలంగా ఉంటుంది. 
 
మీనం : వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. రాజకీయ పరిచయాలు లబ్ధిని చేకూరుస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారు అచ్చుతప్పులు పడుట వల్ల మాటపడక తప్పదు. దైనందిన జీవితంలో స్వల్ప మార్పులు జరుగుతాయి. రుణాలు చేయవలసి వస్తుంది. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు క్షేమదాయకం కాదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు