మొండిబాకీలు వసూలవుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అధికం. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. పత్రాల సవరణలో మార్పులు అనుకూలిస్తాయి. వ్యవహార ఒప్పందాల్లో జాగ్రత్త. పెద్దల సలహా పాటించండి.
వేడుకను ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతిని కొంతమంది వ్యాఖ్యానిస్తారు. విమర్శలు పట్టించుకోవద్దు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. దుబారా ఖర్చులు విపరీతం. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆరోగ్యం సంతృప్తికరం.
శుభవార్త వింటారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. విలాసాలకు ఖర్చు చేస్తారు. వాగ్వాదాలకు దిగవద్దు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సభలు, కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పెట్టుబడులకు తరుణం కాదు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. తప్పటడుగు వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. రుణఒత్తిడి ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య కలహం. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. పనులు అప్పగించవద్దు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పత్రాలు సమయానికి కనిపించవు. ప్రయాణం విరమించుకుంటారు.
మనోధైర్యంతో మెలగండి. యత్నాలను అయిన వారు ప్రోత్సాహిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అజ్ఞాతవ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తి కావు. చిన్న విషయానికే చికాకుపడతారు.
శ్రమించినా ఫలితం ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. మనోధైర్యంతో మెలగండి. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి.
వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. భేషజాలకు పోవద్దు. ఖర్చులు విపరీతం. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. చేపట్టిన పనులు వేగవంతమవుతాయి. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. వేడుకకు హాజరవుతారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. వాహనయోగం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పెద్దమొత్తం చెల్లింపుల్లో జాగ్రత్త. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.