కార్యసాధనలో సఫలీకృతులవుతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఎదుటివారికి మీ సమర్థతపై గురికుదురుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆత్మీయులను విందులకు ఆహ్వానిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు.
ప్రతికూలతలతో సతమతమవుతారు. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం.. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పనులు సాగవు. ఖర్చులు విపరీతం. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. భేషజాలకు పోవద్దు.
కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. రావలసిన ధనం అందుతుంది. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. ప్రముఖులకు చేరువవుతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పనులు అర్ధాంతంగా ముగిస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. రుణ సమస్యలు పరిష్కారమవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి.
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. పనులు వేగవంతమవుతాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ఆత్మీయులను కలుసుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. మాటతీరుతో ఆకట్టుకుంటారు. ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఖర్చులు విపరీతం. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. పరధ్యానంగా ఉంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనుల్లో ఒత్తిడి అధికం. ఆత్మీయుల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. కొత్తయత్నాలు మొదలు పెడతారు. మీ కృషి వెంటనే ఫలిస్తుంది.
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. కొందరిరాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. మీ జోక్యం అనివార్యం. ఉభయులకూ మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. వాహన సౌఖ్యం పొందుతారు.
ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలు చేపడతారు. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లావాదేవీలు పురోగతిన సాగుతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు సానుకూలమవుతాయి. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. అప్రియమైన వార్త వింటారు. పాత పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి.