జాతకం

మీనం
మీన రాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం: 4 ఈ రాశివారికి ఈ సంవత్సరం శుభాశుభాల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్ధికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సంతృప్తికరం. వాహనం, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. కొత్త సమస్యలెదురవుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగవు. పట్టుదలతో యత్నాలు సాగించండి. సహాయం ఆశించి భంగపాటుకు గురవుతారు. అందరితోను కలుపుగోలుగా మెలగండి. విమర్శలకు స్పందించవద్దు. గృహమార్పు కలిసివస్తుంది. దంపతుల మధ్య తరచు కలహాలు, చికాకులు తలెత్తుతాయి. సంయమనంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఉద్యోగస్తుల కష్టం ఫలిస్తుంది. అధికారుల మన్ననలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులకు కష్టాలు, చికాకులు అధికం. చిన్నతరహా వ్యాపారులకు సామాన్యం. విద్యార్థులకు ఓర్పు, క్రమశిక్షణ ప్రధానం. అసాంఘిక కార్యలాపాల్లో జోక్యం తగదు. ఏకాగ్రతతో శ్రమిస్తేనే ర్యాంకులు సాధించగలరు. తరుచు పుణ్యక్షేత్రాల సందర్శనం ఉపశమనం కలిగిస్తాయి. ఈ రాశివారికి తరచు శివాభిషేకాలు, సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధనలు శుభం, జయం.

జనవరి-2024

మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి అన్ని రంగాల వారికీ కలిసివచ్చే సమయం. సర్వత్రా అనుకూలతలుంటాయి. అనుకున్నది సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అపోహ....more

ఫిబ్రవరి-2024

మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి సంకల్పం సిద్ధిస్తుంది. విజ్ఞతతో వ్యవహరిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. చేతిలో ధనం నిలవదు. పెద్దఖర్చు తగిలే ఆస్కాం ఉంది. ఆదాయమార్గాలు అన్వేషిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. పెద్దల....more

మార్చి-2024

మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు.....more

ఏప్రియల్-2024

మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి ఈ మాసం శుభాశుభాల మిశ్రమ సమ్మేళనం. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆప్తుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులు కలిసిరావు. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి.....more

మే-2024

మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు. ఆప్తులకు సాయం అందిస్తారు. కీలక వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. అపరిచితులతో మితంగా సంభాషించండి. వాగ్వాదాలకు....more