* సాధారణంగా వేసవి కాలంలో చాలా మంది శీతల పానీయాలు తాగుతుంటారు. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. అందుకే వాటికి ప్రత్యామ్నాయంగా ఏదైనా పండ్ల రసం లేదా కొబ్బరి నీళ్లలో చిటికెడు నల్ల ఉప్పు కలిపి తాగితే శరీరం చల్లబడుతుంది. వేసవి తాపం నుండి బయటపడవచ్చు. నల్ల ఉప్పుకు శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది.
* కడుపులో మంట, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం ఉన్నవాళ్లు, గుండెల్లో మంట ఉన్నవారు నల్ల ఉప్పు తింటే మంచి ఫలితం ఉంటుంది.