అన్ని రకాల భాషల సాహిత్యంలోనూ స్త్రీల అధరాలను గురించిన వర్ణన లేదంటే అతిశయోక్తి కాదు. తేనెలూరే పెదవులు, మృధువైన పెదవులు, అందమైన పెదవులు అంటూ ఎన్నో రకాలుగా మహిళల అధర సౌందర్యం గురించి వర్ణిస్తుంటారు. ఇక సినిమాలలో వస్తోన్న పాటలలో అయితే చెప్పాల్సిన పనేలేదు!
అధరం ఎంత మధురం... అందం ఎంత సుందరం... నీ రూపే మనోహరం... నీ చూపే స్వయంవరం... నీవే నాకో వరం... అంటూ వచ్చిన అనేకమైన పాటల గురించి మీకు తెలిసే ఉంటుంది. అందం అనేది మహిళలకు దేవుడిచ్చిన వరం. "అందం అనేది సత్యం యొక్క శోభ. అందమైన వస్తువు ఎప్పుడూ ఆనందాన్ని కలుగజేస్తుంది. అందమైనది మంచిగా ఉంటుంది. మంచిగా ఉన్నది త్వరలో అందాన్ని పొందుతుంది" అనేవి పలువురు పెద్దలు చెప్పిన సూక్తులు.
మృధువైన అధరాలు...!
రాత్రిళ్ళు పడుకునేముందు బీట్‌రూట్ రసం రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. పెదవులు ఎర్రగా మారుతాయి. పెదవులు పగిలితే తేనెలో వెన్న కలిపి రాసుకుంటే మంచి ఫలితం వుంటుంది. బాదంపప్పు నూరి పడుకునే ముందు పెదవులపై మర్దనా...
అనేకమంది కవుల కలాల నుండి కూడా మహిళల సౌందర్యం గురించిన గొప్ప సాహిత్యం జాలువారింది. అలాంటి మహిళల సౌందర్యంలో ముఖ్యపాత్రను పోషించే పెదవుల సౌందర్యం గురించిన కొన్ని చిట్కాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గ్లిజరిన్ నిమ్మరసం కలిపి పెదవులకు రాసుకుంటే మృదువుగా ఉంటాయి. తేనె నిమ్మరసాల మిశ్రమాన్ని పెదవులకు రాస్తే పెదవుల నలుపుదనం పోతుంది. పెదవులవల్ల మనకు ఏ ఇబ్బంది రాకుండా వుండాలంటే రోజూ రాత్రి పడుకునే ముందు మీగడగానీ, వెన్నగానీ, వేజలైన్ గానీ... రాసుకోవడం మంచిది.
పెదవులు నల్లగా వున్నవారు రాత్రిళ్ళు పడుకునేముందు బీట్‌రూట్ రసం రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. పెదవులు ఎర్రగా మారుతాయి. పెదవులు పగిలితే తేనెలో వెన్న కలిపి రాసుకుంటే మంచి ఫలితం వుంటుంది. బాదంపప్పు నూరి పడుకునే ముందు పెదవులపై మర్దనా చేసుకుంటే మంచిది.
ఎక్కువ సేపు లిప్‌స్టిక్ నిలిచి ఉండాలంటే... రెండు సార్లు లిప్‌స్టిక్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి వేసుకున్నాక టిష్యూపేపర్తో మృదువుగా అద్దిన తరువాత మరోసారి వేసుకోవాలి. అలాగే... ఎప్పుడు లిప్‌స్టిక్ వేసుకున్నా, పడుకునేముందు, దాన్ని తొలగించి, పడుకోవడం మరచిపోవద్దు.
లిప్‌స్టిక్ వేసుకునే ముందు వేజలైన్ రాసి, దానిమీద లిప్‌స్టిక్ వేసుకుంటే పెదవులు పగలకుండా వుంటాయి. లిప్‌స్టిక్ వేసుకున్న తర్వాత లిప్‌లైనర్ వాడండి. దీనివల్ల లిప్‌స్టిక్ అటూ, ఇటూ మూతి చుట్టూ పరచుకోకుండా ఉంటుంది. లిప్‌స్టిక్, వేజలైన్ కలిపి రాసుకుంటే పెదవులు కొత్త మెరుపును సంతరించుకుంటాయి. లిప్‌స్టిక్‌ను బ్రష్‌తో వేసుకోవడం ద్వారా ఆదా చేయవచ్చు. సహజమైన సన్ బ్లాక్ ఉన్న లిప్ బాం పెదవులకు వాడటం శ్రేయస్కరం.
పెదవులు ఆరోగ్యంగా కనిపించాలంటే... నోటి లోపల కూడా ఆరోగ్యంగా ఉండాలి. చక్కటి, తెల్లటి పలువరుస కూడా పెదాల అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. పళ్ళు తెల్లగా మిలమిలా మెరవాలంటే... ఆరంజ్ తొక్కల పొడికి కొద్దిగా ఉప్పు కలిపి దాంతో పళ్ళు తోముకుంటే ముత్యాల్లాగా మెరుస్తాయి.
పళ్లు శుభ్రంగా, తెల్లగా ఉండాలంటే వారానికోసారి టేబుల్ సాల్ట్ తోగాని, బేకింగ్ సోడాతో గాని తోముకోవాలి. ఉల్లిపాయను మెత్తగా నూరి చిగుళ్ళకు, పళ్ళకు మర్ధనా చేస్తే చిగుళ్ళ వ్యాధులు పోతాయి. నొప్పిగా ఉన్న పంటిమీద చిన్న ఇంగువ ముక్కని వుంచితే ఫలితముంటుంది. పైన చెప్పిన చిట్కాలన్నింటినీ పాటిస్తే... తేనెలూరే మృధువైన పెదవులు మీ సొంతమవుతాయి.