జుట్టుకు మేలు చేసే ఆలివ్ ఆయిల్.. హెయిర్ డ్యామేజ్ నుంచి రిలీఫ్!

శనివారం, 6 ఆగస్టు 2016 (10:50 IST)
జుట్టు సంరక్షణ కోసం వంట నూనెలు బాగా పనిచేస్తాయి. కుకింక్ ఆయిల్స్‌ను ఉపయోగించడం ద్వారా జుట్టు రాలడాన్ని అరికడుతుంది. డ్యామేజ్ నుంచి రిలీఫ్ అవుతుంది. ఆలివ్ ఆయిల్‌లో జుట్టుకు తేమను, పోషకాలను అందిస్తుంది. లోతైన కండీషనర్ గాను ఉపయోగపడుతుంది. ఇది కేశాలకు బలాన్ని అందిస్తుంది.  చుండ్రును నివారిస్తుంది. 
 
బాదాం నూనెలో విటమిన్-ఇ పుష్కలంగా ఉండటం వల్ల కేశాల పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. ఇది కూడా కొబ్బరి, ఆమ్లా నూనెలు మాదిరే ఉంటుంది. అతి త్వరగా జుట్టు పెరగాలనుకొనే వారు బాదాం నూనెను ప్రతి రోజూ తలకు పట్టించాలి.
 
ఇక కొబ్బరి నూనె చర్మం, జుట్టు సంరక్షణలో అద్భుతంగా సహాయపడే కుక్కింగ్ ఆయిల్ కొబ్బరి నూనె. కొబ్బరి నూనె జుట్టుకు మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది. కొబ్బరి నూనె మీ జుట్టుకు కండీషనర్‌గా మాత్రమే కాదు, మీ జుట్టు మందంగా పెరగడానికి కూడా సహాయపడుతుంది.

వెబ్దునియా పై చదవండి