కుంకుమపువ్వుతో కూడిన మిల్క్ క్రీమును పెదవులకు రాస్తే?

గురువారం, 7 జులై 2016 (12:49 IST)
కుంకుపువ్వుతో కూడిన మిల్క్ క్రీమును వాడటం ద్వారా గులాబీ రేకుల్లాంటి పెదవులను సొంతం చేసుకోవచ్చు. ఇది నల్లటి పెదవులకు గులాబీ రంగును తెస్తాయి. రోజులో చాలా సార్లు దీన్ని ఉపయోగించాలి. నిద్రించే ముందుకు మిల్క్ క్రీమును రాసుకోవడం ద్వారా పెదవులకు ప్రత్యేక అందం చేకూరుతుంది. అలాగే స్ట్రాబెర్రీ, రాస్బెర్రీల జ్యూస్‌ను పెదవులకు రాయడం ద్వారా పెదవులు రోజ్‌గా తయారవుతాయి. 
 
రాస్బెర్రీ, తేనె కలిపిన మిశ్రమాన్ని కలబంద రసానికి కలిపి పేస్టులా రాసుకుని ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచి.. ఆ పై పొడి బట్టతో తుడిచేయాలి. తర్వాత లిప్ బామ్ వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఇక తాజా మంచు గడ్డలను పెదాలకి రాయటం వలన అవి తేమని అందించటమే కాకుండా, పెదాలని హైడ్రెటేడ్‌గా ఉంచుతాయి. ఇంకా గులాబీ రంగుల్లాంటి పెదవులకు ఫ్రిజ్‌లోని ట్రేలో నీటిని నింపి ఆ ఐస్ గడ్డలనే వాడండి.. అంటున్నారు బ్యూటీషన్లు.

వెబ్దునియా పై చదవండి