ముఖం పాలిపోయిందా? నిర్జీవంగా మారిందా.. అయితే ఇలా చేయండి.. రెండు చెంచాల పెరుగులో టమోటా రసం కలుపుకోవాలి. ఈ పేస్టును ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటిలో కడిగేయాలి. పెరుగులోని పోషకాలు చర్మాన్ని బిగుతుగా మార్చి, మెరిసేలా చేస్తే, టొమాటో ఉపశమనం అందించి, తాజాగా మారుస్తుంది.
ఓ టమోటాను తీసుకుని మెత్తని ముద్దలా చేసుకుని.. దీన్ని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తరవాత కడిగేసి వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల మొటిమలు తగ్గుముఖం పడతాయి. టొమాటోలో ఉండే కూలింగ్, యాస్ట్రింజెంట్ గుణాలు చర్మానికి సాంత్వన అందించి, అధిక జిడ్డును పీల్చుకుంటాయి. అలా మొటిమలు తగ్గుతాయి.