బీట్‌రూట్ రసంలో ఒక చెంచా పెరుగు మిక్స్ చేసి...

శుక్రవారం, 1 మార్చి 2019 (19:29 IST)
బీట్‌రూట్ ఆరోగ్యానికే కాదు అందానికి ఎంతో ఉపయోగపడుతుంది. బీట్‌రూట్‌తో అందానికి కొన్ని చిట్కాలు చూద్దాం.
 
1. బీట్‌రూట్ రసంలో ఉండే లక్షణాలు కళ్ళ ఉబ్బును నివారిస్తుంది. రెండు చెంచాల బీట్‌రూట్ రసంలో ఒక చెంచా పెరుగు మిక్స్ చేసి ముఖానికి పట్టించి ఇరవై నిముషాల తర్వాత ముఖం చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలతో పాటు వాటి తాలుకు మచ్చలను కూడా పూర్తిగా నివారిస్తుంది.
 
2. బీట్‌రూట్ జ్యూస్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మ ఛాయ మెరుగుపడుతుంది. బీట్‌రూట్ పేస్ట్‌లో కొద్దిగా పాలు మిక్స్ చేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.
 
3. ఒక టీస్పూన్ బీట్‌రూట్ జ్యూస్‌కు ఒక చెంచా నిమ్మరసం మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. రాత్రి పడుకొనే ముందు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
4. బీట్‌రూట్ రసం, షుగర్ రెండింటి మిశ్రమాన్ని ముఖానికి పట్టించి స్ర్కబ్ చేయడం వల్ల ముఖంలో ఉండే బ్లాక్ హెడ్స్ నివారించబడుతాయి. ఉడకబెట్టిన బీట్‌రూట్‌ను గుజ్జుగా చేసి ముఖానికి, మెడభాగంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే మీ చర్మంలో కాంతి వస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు