రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ ఓ శుభవార్త చెప్పింది. ఇకపై అతి తక్కువ ధరకే ఏసీ ప్రయాణం సౌకర్యం కల్పించనుంది. ఇందుకోసం ఏసి 3 టైర్ కోచ్‌ను ఏర్పాటు చేస్తోంది. రైల్వే 806 ఎకానమీ ఏసీ 3 టైర్ కోచ్‌లను ఈ ఏడాది పలు మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సరసమైన ఛార్జీల వద్ద ఏర్పాటు చేస్తుంది.
ఇప్పుడు 2021-22 ఆర్థిక సంవత్సరానికి 806 బోగీలను సిద్ధం చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. యాంటీగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్) లో 344, రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్‌సిఎఫ్)లో 177, మోడరన్ కోచ్ ఫ్యాక్టరీ (ఎంసిఎఫ్) లో 285 బోగీలను తయారు చేస్తున్నారు.