పెట్రో మంటను భరించాల్సిందే : తేల్చి చెప్పిన కేంద్రం

మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (10:50 IST)
దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ధరల పెరుగులపై వినియోగదారులు గగ్గోలుపెడుతున్నా కేంద్ర మంత్రి నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. అన్ని విపక్ష పార్టీలు పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నా కేంద్రం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పైగా, అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా వ్యాఖ్యలు చేసింది.
 
పెట్రోల్ ధరల తగ్గింపు చర్యల్లో భాగంగా, పెట్రోల్‌పై విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే ఆలోచన లేదని కేంద్ర ఆర్థికశాఖ సీనియర్ అధికారి తేల్చిచెప్పారు. బడ్జెట్‌లోని ఆర్థిక లోటును తగ్గించాలంటే ఇప్పుడు ఏక్సైజ్ డ్యూటీని తగ్గించడం సాధ్యం కాదన్నారు. పైగా రాష్ట్రాలే వ్యాట్‌ను తగ్గించుకోవాలని సూచించారు. ఎక్సైజ్ డ్యూటీలో తగ్గే ప్రతి రూపాయితో రూ.13 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు