డబుల్ డెక్కర్ బస్సులు, రైళ్ల తరహాలో ప్రస్తుతం డబుల్ డెక్కర్ విమానాలు వచ్చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో విమానాల్లో డబుల్ డెక్కర్ సీట్లు రానున్నాయి. దీని కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రయాణికుల సంఖ్య పెరగడం వల్ల ఆదాయం వస్తుంది కనుక కంపెనీలకు ఇదేమీ భారం కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
1970 నుంచి చాలావరకు విమానయాన సీట్లలో మార్పులేదు.
ఎకానమీ క్లాస్ సీట్లలో 99 శాతం నిటారుగా నిద్రించడానికి అసాధ్యం. డబుల్ డెక్కర్ సదుపాయం వస్తే విమానాల్లో ప్రయాణించే వారిలో 70 శాతం మంది లై ఫ్లాట్ భంగిమలో నిద్రించవచ్చు. ప్రయాణికులందరికీ సౌకర్యవంతమైన విమాన ప్రయాణాన్ని అందిస్తూ.. ప్రజలకు డబ్బు ఆదా చేస్తుంది. అంతేకాదు ఎకానమీ క్లాస్‌లో సౌకర్యవంతంగా ప్రయాణించడానికి సాయపడుతుంది.