స్వీట్స్ చేస్తున్నారా.. ఇవిగోండి టిప్స్

మంగళవారం, 5 ఆగస్టు 2014 (18:52 IST)
బొబ్బట్లు, కొబ్బరితో బొబ్బట్లను తిని బోర్ కొట్టిందా ? అయితే క్యారెట్ తురుము, కోవా, తగినంత బెల్లం, నెయ్యి వేసి కలిపి పూర్ణం చుట్టి దీనితో బొబ్బట్లను చేస్తే చాలా రుచిగా ఉంటాయి.
 
గులాబ్ జామూన్ కోసం
గులాబ్ జామూన్‌ను ఎక్కువ సేపు పాకంలో ఉంచితే అవి ఎక్కువగా పీల్చుకుని విరిగిపోయే ప్రమాదం ఉంది. కనుక కాసేపు ఉంచి తర్వాత తీసి వేరే పాత్రలో ఉంచండి. సర్వ్ చేసే సమయంలో పాకంతో కలిపి చేయండి.
 
నెయ్యి పొదుపు కోసం
కేసరి చేసే సమయంలో ఎక్కువగా నెయ్యి, డాల్డాలు అవసరమవుతాయి. ఇలాంటి సమయంలో ముందుగా రవ్వను డాల్డాలో ఎర్రగా వేయించి కాచిన పాలలో నానబెట్టండి. తర్వాత ఇందులో పంచదార వేసి కేసరిని తయారు చేయండి. ఎక్కువగా నెయ్యి, డాల్డాలు అవసరం లేకుండానే స్వీట్ రెడీ.
 
హల్వా చేసేటప్పుడు
హల్వా చేసే సమయంలో మందంగా ఉండే బాణాలిని ఉపయోగించండి. ఈ పాత్రలు ఎక్కువ వేడిని తట్టుకుంటాయి కనుక హల్వా త్వరగా తయారవుతుంది.
 
రుచికరమైన జామూన్ కోసం
గులాబ్ జామూన్ మిక్స్‌తో పెసర పిండిని కలిపి జామూన్‌లు చేస్తే రుచి మధురంగా ఉండడమే కాకుండా పోషకాలు కూడా లభిస్తాయి.

వెబ్దునియా పై చదవండి