ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ శాస్త్రవేత్త సత్యజిత్ రథ్ దీనిపై స్పందించారు. మొదటి డోసు పొందిన నాలుగు వారాల తర్వాత నుంచి ఎప్పుడైనా రెండో డోసును ఇవ్వవచ్చు. ఆరు నెలలలోపు ఇస్తే సరిపోతుంది. అయినా దాని బూస్టర్ సామర్థ్యంలో తేడా ఉండదు. అద్భుతంగా రోగ నిరోధక స్పందనను పెంచుతుందన్నారు. అలాగే, మొదటి డోసు పొందిన నెలలోపు రెండో డోసును పొందినా.. టీకా రక్షణ సామర్థ్యమేమీ పెరగబోదని చెప్పారు.