కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు వణికిస్తున్నారు. ముఖ్యంగా, అనారోగ్య సమస్యలతో పాటు వృద్ధులు, చిన్నారులు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే తాజాగా ఓ విస్తుగొలిపే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ బారినపడిన పురుషుల్లో అంగస్తంభన సమస్య తలెత్తుతున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు.
కరోనా వైరస్ సోకి, దాని నుంచి బయటడిన వారికి దీర్ఘకాలిక కాలిక సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, పురుషులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నట్టు తెలిపారు.
'కరోనా వైరస్ రక్తనాళ వ్యవస్థలో సమస్యలకు కారణమవుతుందని మాకు తెలుసు. ఫలితంగా పురుషుల్లో దీర్ఘకాలిక అంగస్తంభన సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది నిజంగా ఆందోళన చెందాల్సిన విషయం. వైరస్ మనల్ని చంపడమే కాదు, వాస్తవానికి దీర్ఘకాలిక, జీవితకాల, సంభావ్య, సమస్యలకు కారణమవుతుంది' అని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.