కరోనా వైరస్ వయస్సుతో సంబంధం లేకుండా సోకుతోంది. చిన్నా, పెద్ద అన్న తేడా లేకుండా కబళిస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులు, వృద్ధులే కాకుండా యువతపై తీవ్ర ప్రభావం చూపింది. మొదటి దశలో వృద్ధులు, రెండవ దశలో యువతపై పంజా విసిరింది. లెక్కకు మించి మరణాలు సంభవించాయి.
వాటి నుంచి కోలుకోకముందే మరో ముప్పు పొంచి ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడో దశలో చిన్నపిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందంటున్నారు. తొలి, మలిదశ కంటే మూడవ దశ చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. గత రెండురోజుల నుంచి కేసులు తగ్గుముఖం పట్టినా మరణాల సంఖ్య మాత్రం పెరుగుతున్నాయి.
ఫస్ట్ వేవ్‌లో ఒక్కశాతం కంటే తక్కువమంది పిల్లలకు కరోనా సోకగా, సెకండ్ వేవ్‌లో మాత్రం పిల్లల్లో సంక్రమణ రేటు 10 శాతం రేటు పెరిగింది. పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ ఇవ్వలేదు. దీంతో చిన్నారులకు 80 శాతం వరకు ప్రమాదం ఉండొచ్చు అంటున్నారు. మాస్క్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజర్లు వాడటం పిల్లలకు పెద్దగా తెలియదు.