బీసీసీఐ చీఫ్ సెలెక్టరుగా అజిత్ అగార్కర్

బుధవారం, 5 జులై 2023 (09:58 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీ నూతన ఛైర్మన్‌ను ఎంపిక చేసింది. టీమిండియా మాజీ ఆటగాడు అజిత్ అగార్కర్‌ను చీఫ్ సెలెక్టరుగా నియమించింది. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం రాత్రి ఓ పత్రికా ప్రకటన చేసింది. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవికి మాజీ క్రికెటర్లు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను బీసీసీఐ సెలెక్షన్ కమిటి ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూలో మెరుగైన ప్రజంటేషన్ ఇచ్చిన అజిత్ అగార్కర్‌ను చీఫ్ సెలెక్టరుగా ఎంపిక చేశారు. కాగా, జాతీయ సెలెక్షన్ కమిటీలో సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్, శివసుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ సభ్యులుగా ఉ్నారు. వీరు జోన్ల వారీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో 45 యేళ్ల అజిత్ అగార్కర్‌ను చీఫ్ సెలెక్టరుగా ఎంపిక చేశారు. క్రికెట్ కెరీర్‌కు ఎపుడో స్వస్తి చెప్పిన అగార్కర్ తన క్రికెట్ కెరీర్‌లో 26 టెస్టులు ఆడారు. ముంబై బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా 58 వికెట్లు తీశాడు. టెస్టుల్లో అగార్కర్‌కు ఒక సెంచరీ కూడా ఉంది. వన్డేల్లో 191 మ్యాచ్‌లు ఆడిన అగార్కర్ 288 వికెట్లు పడగొట్టాడు. నాలుగు అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారత్ జట్టుకు సారథ్యం వహించాడు. అలాగే, 42 ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా ఆడాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు