చాంపియన్స్ ట్రోఫీ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్

ఠాగూర్

ఆదివారం, 23 ఫిబ్రవరి 2025 (14:42 IST)
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. క్రికెట్ అభిమానులు అమితాసక్తితో ఎదురు చూస్తున్న ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లూ అమీతుమీ తేల్చుకోనున్నాయి. 
 
ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో రోహిత్ శర్మ, గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్‌లకు తుది జట్టులో చోటు కల్పించారు. 
 
అలాగే, పాకిస్థాన్ జట్టులో ఇమామ్ ఉల్ హక్, బాబార్ అజామ్, సౌద్ షకీల్, రిజ్వాన్, సల్మాన్ అఘా, తాహిర్, ఖుష్దిల్ షా, షహీన్, నసీమ్ షా, హారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్‌లు ఉన్నారు.
 
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్‌కు దిగి 1.3 ఓవర్లలో ఎనిమిది పరుగులు చేసింది. ఇందులో ఆరు పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో రావడం గమనార్హం. తొలి ఓవర్ వేసిన మహ్మద్ షమీ ఏకంగా ఐదు వైడ్‌లు వేశాడు. క్రీజ్‌లో ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజామ్‌లు ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు