మహిళల ట్వంటీ-20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్‌ను తప్పించడంతో కెప్టెన్ హర్మన్ ప్రీత్, టీమ్ యాజమాన్యంపై నెటిజన్లు పెద్దఎత్తున విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై మిథాలీ రాజ్ స్పందించారు.
అధికారంలో వున్న కొందరు తన కెరీర్‌ను నాశనం చేయాలని.. తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. డయానా ఎడుల్జీ పట్ల విశ్వాసం, గౌరవం ఇచ్చినా.. ఆమె అధికారాన్ని తన వ్యవహారంలో దుర్వినియోగం చేశారని.. హర్మన్ ప్రీత్‌పై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పింది.
తన దేశానికి ప్రపంచ కప్ అందించాలనుకున్నా. కానీ కుదరలేదు. ఇక టీమ్ కోచ్ రమేష్ పొవార్ తనను మానసికంగా వేధించారు. నెట్స్‌లో ఎవరు బ్యాటింగ్ చేస్తున్నా.. స్థిరంగా నిలబడి వారి ఆటను పరిశీలిస్తూ... సలహాలు చేసేవారు. తన బ్యాటింగ్ చేస్తుంటే.. అక్కడ వుండకుండా పక్కకి వెళ్లిపోయేవారు. గత కొద్దిరోజులుగా తనను అవమానించారని.. కానీ సహనం కోల్పోకుండా ప్రశాంతంగానే వున్నానని మిథాలీ రాజ్ వెల్లడించింది.