స్టేడియంలో అనుచిత ప్రవర్తన.. రెడ్ కార్డ్ అమలు.. భలే నిర్ణయమన్న సౌరవ్ గంగూలీ

గురువారం, 28 సెప్టెంబరు 2017 (15:31 IST)
క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా.. ఇతర క్రీడాకారులపై అనుచిత ప్రవర్తనకు పాల్పడితే అక్కడే ఉండే అంపైర్లు వెంటనే స్పందించి, అతని తప్పు తీవ్రతను బట్టి రెడ్ కార్డు చూపించే అధికారాన్ని కల్పించడంపై బెంగాల్ ప్రిన్స్, మాజీ టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ సానుకూలంగా స్పందించారు. 
 
అంపైర్‌ను దూషించినా, ఉద్దేశ పూర్వకంగా ఎదుటి జట్టు క్రికెటర్‌ను అడ్డుకున్నా.. చేజేసుకున్నా.. అతని తప్పు తీవ్రతను బట్టి రెడ్ కార్డు చూపించే అధికారాన్ని కల్పిస్తూ, ఐసీసీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సాధారణంగా లెవల్ 4 తప్పులకే రెడ్ కార్డును చూపిస్తారు. లెవల్ 1 నుంచి లెవల్ 3 తీవ్రతతో ఉండే తప్పులను చేసే ఆటగాళ్లకు ప్రస్తుతం అమలులో ఉన్న ఐసీసీ ప్రవర్తనా నియమావళే వర్తిస్తుంది.
 
గురువారం నుంచి ఈ నిబంధన అమలులోకి రానుంది. దీనిపై స్పందించిన గంగూలీ, ఇకపై ఆటగాళ్ల ప్రవర్తనలో మార్పు వస్తుందని, వారు సాధారణంగా చేసే తప్పుల తీవ్రత కూడా తగ్గుతుందని తెలిపాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు