చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోటీకి సర్వం సిద్ధం.. ఎలాంటి పిచ్‌పై మ్యాచ్ జరుగుతుందంటే...

ఠాగూర్

శనివారం, 8 మార్చి 2025 (11:38 IST)
చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలోభాగంగా, ఆదివారం ఫైనల్ పోరు జరుగనుంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీకి ఫైనల్ మ్యాచ్ మాత్రం పాకిస్థాన్‌లో కాకుండా దుబాయ్‌లో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం భారత క్రికెట్ జట్టు ఫైనల్‌‍కు చేరుకోవడమే. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఫైనలో పోరును దుబాయ్‌లో నిర్వహిస్తున్నారు. ఆదివారం జరిగే మ్యాచ్‌‍లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం బ్రాండ్ న్యూ పిచ్ కాకుండా, సెమీ ప్రెచ్‌ను సిద్ధం చేసినట్టు తెలిపింది. 
 
రెండువారాల క్రితం అంటే ఫిబ్రవరి 23వ తేదీ ఈ పిచ్‌ను గ్రూపు దశలో భారత్ - పాక్ మ్యాచ్‌కు ఉపయోగించారు. దీంతో ఇపుడు ఇదే పిచ్‌ను సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ మ్యాచ్‌లో పాక్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలో ఛేదించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసి తన ఖాతాలో 51వ శతకాన్ని వేసుకున్నాడు. 111 బంతుల్లో 100 పరుగులు చేసి జట్టు విజయం కీలక పాత్ర పోషించాడు. శుభమన్ గిల్ 46 బంతుల్లో 56 పరుగులు చేశాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు