విండీస్ బ్యాట్స్ విమెన్‌లలో హేలీ మాథ్యూస్ (43), షానెల్ డాలీ (33), ఆఫీ ఫ్లెచర్ (36) మినహా మరెవరూ రాణించలేదు. ఫలితంగా 8వికెట్ల నష్టానికి విండీస్ 183 పరుగులు సాధించింది. భారత్ బౌలర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్, పూనమ్ యాదవ్, దీప్తి శర్మ రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టగా ఎక్తా బిష్త్ ఓ వికెట్ నేల కూల్చింది.
అనంతరం 184 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో 45 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ స్మృతి మందన 108 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 106 పరుగులతో శతక్కొట్టగా.. జట్టుకు విజయం సునాయాసమైంది.