థర్డ్ టీ20లో ఓడిన భారత్ - సిరీస్‌లో 2-1 తేడాతో కైవసం

సోమవారం, 11 జులై 2022 (09:48 IST)
నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌లో వేదికగా ఆదివారం జరిగిన టీ20 సిరీస్‌లోని మూడవ మరియు చివరి టీ20లో ఇంగ్లాండ్‌ చేతిలో భారత్ 17 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ చేసిన వీరోచిత సెంచరీ వృథా అయింది. 
 
ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ తీవ్ర నిరాశకు లోనుచేసింది. అతి తక్కువ సమయంలోనే టాప్ ఆర్డర్ వికెట్లను కోల్పోయింది. సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్ (117 నాటౌట్), శ్రేయాస్ అయ్యర్ (28) మినహా ఇతర ఆటగాళ్లు బ్యాట్‌తో రాణించలేకపోయారు. వీరిద్దరూ కలిసి అత్యధికంగా 119 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 
 
కానీ ఇంగ్లీష్ ఆటగాళ్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో మ్యాచ్‌ను తమ వైపునకు లాగేసుకున్నారు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే, తొలి రెండు మ్యాచ్‌లలో గెలుపొందడంతో భారత్ సిరీస్‌ను 2-1తో తేడాతో కైవసం చేసుకుంది.
 
ఈ మ్యాచ్‌లో 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఓవర్‌లో కేవలం ఒక్క పరుగులకే రిషబ్ పంత్‌ను కోల్పోయింది. వికెట్ కీపర్, కెప్టెన్ జోస్ బట్లర్ పంత్‌ను వెనుక నుంచి క్యాచ్ పట్టడంతో మీడియం-పేసర్ రీస్ టోప్లీ అతన్ని పెవిలియన్‌కు పంపాడు.
 
దీంతో విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. మూడో ఓవర్‌లో డేవిడ్ విల్లీని ఫోర్, సిక్సర్ బాదిన అతను మంచిగా కనిపించాడు. కానీ ఆ ఓవర్‌లో వైడ్-లెంగ్త్ బాల్‌ను స్లాప్ చేయడానికి ప్రయత్నించిన అతను కేవలం 13 పరుగులకే ఔటయ్యాడు. బంతి జాసన్ రాయ్ చేతిలో సురక్షితంగా పడింది.
 
తర్వాత క్రీజులో సూర్యకుమార్ యాదవ్ రాగా, రోహిత్-సూర్యకుమార్ కొన్ని మంచి షాట్లు కొట్టి, వికెట్ల మధ్య పటిష్టమైన పరుగును కొనసాగించడం ద్వారా భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు ప్రయత్నించారు. అయితే ఫిల్ సాల్ట్ సేఫ్ హ్యాండ్స్ సహాయంతో టోప్లీ 11 పరుగుల వద్ద రోహిత్‌ను అవుట్ చేయడంతో అతని ఇన్నింగ్స్ 18 పరుగుల వద్ద ముగిసింది. 31 పరుగుల వ్యవధిలో తన టాప్ ఆర్డర్‌తో తిరిగి భారత్ సంక్షోభంలో పడింది.
 
తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ కొన్ని చక్కటి షాట్‌లను కొట్టాడు. తొలి పది ఓవర్లు ముగిసే సమయానికి సూర్యకుమార్ యాదవ్ (41*), శ్రేయాస్ అయ్యర్ (14*)లతో  భారత్ స్కోరు 82/3తో నిలిచింది.
 
32 బంతుల్లో యాదవ్ తన ఐదవ టీ20 హాఫ్ సెంచరీని పూర్తిచేశాడు. ఆ తర్వాత సూర్యకుమార్, శ్రేయాస్ అయ్యర్‌లు కలిసి 54 బంతుల్లోనే 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 15 ఓవర్లు ముగిసే సరికి సూర్యకుమార్ యాదవ్ (93*), శ్రేయాస్ అయ్యర్ (28*) చొప్పున పరుగుులు చేశారు. చివరి ఐదు ఓవర్లలో భారత్‌కు మరో 67 పరుగులు అవసరం. 
 
ఆట భారత్‌కు అనుకూలంగా మారింది. అయితే, వికెట్ కీపర్ బట్లర్ చేతిలో క్యాచ్ పట్టడంతో 28 పరుగుల వద్ద అయ్యర్ కీలక వికెట్‌ను టాప్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అయ్యర్-యాదవ్ మధ్య 119 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన దినేష్ కార్తీక్ మరో ఎండ్‌లో ఉన్న దినేష్ కార్తీక్‌కు సహకారం అందించాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ కేవలం 48 బంతుల్లో 12 ఫోర్లు, ఐదు సిక్సర్లతో తన తొలి టీ20 సెంచరీని పూర్తిచేసుకున్నాడు. 
 
217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే భారత్‌ ప్రయత్నంలో కార్తీక్‌ 6 పరుగులకే విల్లీ బౌలింగ్‌లో లెగ్‌ బిఫోర్‌ వికెట్‌లో కావడంతో ఐదు వికెట్లకు 166 పరుగులు చేసింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా... రిచర్డ్ గ్లీసన్ చేతిలో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు కూడా క్రీజ్‌లో రాణించలేక పోయారు. ఫలితంగా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరగులు మాత్రమే చేయగలిగింది. 
 
అంతకుముందు, డేవిడ్ మలన్ చేసిన హాఫ్ సెంచరీ మరియు లియామ్ లివింగ్‌స్టోన్ చేసిన ఘనమైన అజేయ నాక్‌తో ఆదివారం ఇక్కడ నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌లో భారత్‌తో జరిగిన మూడో, చివరి టీ20లో ఇంగ్లండ్ వారి ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 215/7 భారీ స్కోరు చేసిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు