అభిషేక్ శర్మ వీర కుమ్ముడు : ముంబై టీ20లో భారత్ ఘన విజయం (Video)

ఠాగూర్

ఆదివారం, 2 ఫిబ్రవరి 2025 (22:08 IST)
ముంబై వేదికగా ఆదివారం రాత్రి జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా యువ క్రికెటర్ అభిషేక్ శర్మ వీర కుమ్ముడు ధాటికి ఇంగ్లీష్ బౌలర్లు చేతులెత్తేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అభిషేక్ శర్మ 54 బంతుల్లో 13 సిక్సర్లు 7 ఫోర్ల సాయంతో 135 పరుగులు చేశాడు. కేవలం 37 బంతుల్లోనే విధ్వంసకర బ్యాటింగ్‌తో టీ20ల్లో రండో అత్యంత వేగవంతమైన సెంచరీని తన పేరిట లిఖించుకున్నాడు.  ఓపెనర్ గా వచ్చిన అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఏడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు.
 
అంతకుముందు టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఇక టీమిండియా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ సంజూ శాంసన్ 16, తిలక్ వర్మ 24, శివమ్ దూబే 30, అక్షర్ పటేల్ 15 పరుగులు చేశారు. శివమ్ దూబే 13 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 2 సిక్సులతో అలరించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 3, మార్క్ ఉడ్ 2, జోఫ్రా ఆర్చర్ 1, జేమీ ఒవెర్టన్ 1, అదిల్ రషీద్ 1 వికెట్ తీశారు.
 
అనంతరం, 248 పరుగుల భారీ లక్ష్యఛేదన ఆరంభించిన ఇంగ్లండ్ జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది. ఆ జట్టు 2 ఓవర్లలోనే 23 పరుగులు చేసింది. ఆ 23 పరుగులు ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఒక్కడే కొట్టాడు. అయితే, మూడో ఓవర్లో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ బ్రేక్ ఇచ్చాడు. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్‌ను షమీ అవుట్ చేయడంతో టీమిండియా శిబిరంలో ఉత్సాహం నెలకొంది. చివరకు 97 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో భారత్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. 


 

⚡️???? ???? Abhishek Sharma!pic.twitter.com/Kg2L2kdXW2

— Sachin Tendulkar (@sachin_rt) February 2, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు