డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ 137 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్.. కెప్టెన్ నికోలస్ పూరన్ (42, 32 బంతుల్లో 5x4, 1x6), బ్రెండన్ కింగ్ (42; 37 బంతుల్లో 5x4, 1x6) మాత్రమే టాప్ స్కోరర్లుగా నిలిచారు.
మిగతా బ్యాట్స్‌మెన్ మొత్తం చేతులెత్తేయడంతో విండీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఇక భారత బౌలర్లలో చాహల్ 4 వికెట్లు తీయగా శార్దూల్, సిరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. ప్రసిద్ధ్, అక్షర్ పటేల్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
అంతకుముందు భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ శిఖర్ ధావన్ (54 నాటౌట్) అర్థ సెంచరీతో రాణించాడు. అలాగే, శుభమన్ గిల్ (44) బాధ్యతాయుతంగా ఆడాడు. వీళ్లద్దరూ నిలకడగా ఆడటంతో భారత్ నిర్ణీత 36 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది.