Match Preview:గుజరాత్ వర్సెస్ లక్నో.. రషీద్-రాహుల్ ఫైట్ వుంటుందా?

సోమవారం, 28 మార్చి 2022 (16:36 IST)
Lucknow_Gujarat
ఐపీఎల్ 2022లో భాగంగా నేడు ల‌క్నోసూప‌ర్ జెయింట్స్, గుజ‌రాత్ టైటాన్స్ త‌ల‌ప‌డనున్నాయి. ఈ మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌గ‌నుండ‌గా.. ర‌షీద్ ఖాన్ గుజ‌రాత్ టైటాన్స్ త‌ర‌ఫున బ‌రిలోకి దిగ‌నున్నాడు. 
 
దీంతో ఈ సారైనా ర‌షీద్ ఖాన్‌ను కేఎల్ రాహుల్ స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కోవాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ల‌క్నో జ‌ట్టులో రాహుల్ పాత్ర కెప్టెన్‌గానే కాకుండా బ్యాట‌ర్‌గానూ కీల‌కంగా ఉంది. 
 
రాహుల్‌, ర‌షీద్ రికార్డులు
ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 94 మ్యాచ్‌లు ఆడిన కేఎల్ రాహుల్ 47 స‌గ‌టుతో 3273 ప‌రుగులు చేశాడు. ఇందులో 2 సెంచ‌రీలు, 27 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 76 మ్యాచ్‌లాడిన ర‌షీద్ ఖాన్ 93 వికెట్లు తీశాడు. అత్యుత్త‌మ గ‌ణాంకాలు 3/7 గా ఉన్నాయి. ఎకాన‌మీ 6.33గా ఉండ‌డం గ‌మ‌నార్హం.
 
ఇకపోతే.. టీ20 ఫార్మాట్లో కేఎల్ రాహుల్, ర‌షీద్ ఖాన్ త‌ల‌ప‌డిన మ్యాచ్‌ల్లో ఆఫ్ఘ‌నిస్థాన్ స్పిన్న‌ర్‌దే పై చేయిగా నిలిచింది. టీ20 ఫార్మాట్లో ర‌షీద్ ఖాన్ వేసిన 30 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 18 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. రాహుల్ స్ట్రైక్ రేట్ 60 మాత్ర‌మే కాగా, స‌గ‌టు కేవ‌లం 6 గానే ఉంది. 14 బంతులు డాట్స్ కాగా ర‌షీద్ ఖాన్ చేతిలో కేఎల్ రాహుల్ 3 సార్లు ఔట‌య్యాడు. 
 
ఈ గ‌ణాంకాల‌ను బ‌ట్టి కేఎల్ రాహుల్‌పై ర‌షీద్ ఖాన్ పూర్తి అధిప‌త్యం చెలాయించ‌డాని అర్థం చేసుకోవ‌చ్చు. ర‌షీద్ ఖాన్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ క‌నీసం ఒక్క బౌండ‌రీ కూడా బాదకపోవ‌డం గ‌మ‌నార్హం. దీనిని బ‌ట్టి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో రాహుల్‌కు ఎంత చెత్త రికార్డులు ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు