147 యేళ్ల క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడిగా... శ్రీలంక క్రికెటర్ కమిందు మెండిస్

ఠాగూర్

శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (09:33 IST)
టెస్ట్ క్రికెట్ చరిత్రలో శ్రీలంక యువ ఆటగాడు కమందు మెండిస్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో అరంగేట్రం చేసిన నాటి నుంచి బ్యాటింగ్‌లో అప్రతిహతంగా దూసుకెళుతున్నాడు. ఈ క్రమంలో ఒక వర్ధమాన ఆటగాడు వరుసగా ఎనిమిది టెస్ట్ మ్యాచ్‌లలో 50 అర్థ సెంచరీలు చేయడం 147 యేళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
స్వదేశంలో పర్యాటన న్యూజిలాండ్ జట్టుతో గురువారం నుంచి ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్‌‍లోనూ మెండిస్ నిలకడైన ప్రదర్శన చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కమిందు మెండిస్ 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో అతడు చారిత్రాత్మకమైన రికార్డును సృష్టించాడు. అరంగేట్రం తర్వాత వరుసగా ఎనిమిది టెస్ట్ మ్యాచ్ 50 కంటే ఎక్కువ పరుగులు సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా కమిందు అవతరించాడు. ఒక వర్ధమాన ఆటగాడు వరుసగా ఎనిమిది టెస్టుల్లో 50 ప్లస్ స్కోర్లు సాధించడం 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.
 
కమిందు మెండిస్‌కు ముందు పాకిస్థాన్ ఆటగాడు షాద్ షకీల్ వరుసగా ఏడు టెస్టు మ్యాచ్ 50 ప్లస్ స్కోర్లు సాధించాడు. అతడికంటే ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వరుసగా 6 మ్యాచ్‌లలో 50కి పైగా స్కోర్లు సాధించారు. అయితే గవాస్కర్‌తో మరో ముగ్గురు బ్యాటర్లు కూడా వరుసగా 6 టెస్ట్ మ్యాచ్‌లలో 50కిపైగా స్కోర్లు సాధించారు. అరంగేట్రం నుంచి వరుస టెస్టుల్లో 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్ల వివరాలను పరిశీలిస్తే, కమిందు మెండిస్ (8), సౌద్ షకీల్ (7), సునీల్ గవాస్కర్, బెర్ట్ సట్‌క్లిఫ్, సయీద్ అహ్మద్, బాసిల్ బుచర్ (6)లు ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు