పూణే టెస్టులో భారత్ బౌలర్లు, బ్యాట్స్‌మెన్లు ధీటుగా రాణించలేకపోయారు. ఫలితంగా భారత్ ముందు 441 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా నిర్దేశించింది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. ఓవర్ నైట్ స్కోరు 143/4తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 285 పరుగుల వద్ద ఆలౌటైంది.
అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ అతి స్వల్ప 105 పరుగులకే అన్నీ వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు మెరుగ్గా రాణించారు. కంగారూల బ్యాట్స్‌మెన్లలో వార్నర్ 10, మార్ష్ 0, స్మిత్ 109, హ్యండ్స్‌కోంబ్ 19, రెన్‌షా 31, మిచెల్ మార్ష్ 31, వేడ్ 20, స్టార్క్ 30, ఓకీఫ్ 6, లియాన్ 13, హజెల్‌వుడ్ 2 నాటౌట్‌గా నిలిచారు. ఫలితంగా 87 ఓవర్లలో ఆస్ట్రేలియా 285 పరుగులకు ఆలౌటైంది.