ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 2019 ప్రపంచకప్ వరకూ తాను భారత జట్టు తరపున ఆడాలనుకుంటున్నట్టు చెప్పారు. 2019 చివర్లోనే తన అంతర్జాతీయ కెరీర్‌పై నిర్ణయం తీసుకుంటానని తెలిపాడు. యువరాజ్ సింగ్ చివరిగా 2017లో భారత జట్టు తరపున వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. రెండు దశాబ్దాలుగా దేశం కోసం ఆడుతున్న తాను ఏదో ఒక రోజు విరామం తీసుకుంటానని తెలిపారు.