తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంలో ఘోరం జరిగింది. అరుణాచలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 18 ఏళ్ల యువతిపై ఇద్దరు పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి వేళ ఎంథాల్ బైపాస్ రోడ్డు వద్ద టమోటాలు తీసుకుని వెళ్తున్న వాహనాన్ని సుందర్, సురేష్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఆపారు. తనిఖీ పేరిట వాహనంలో వున్న 18 ఏళ్ల ఏపీ యువతిని కిందికి దించి ఆమెపై భౌతిక దాడి చేసారు.