రంగురంగుల నెయిల్ పాలిష్‌లతో పాటు ఒక నెయిల్ రిమూవర్ ఉంటే చాలు. ఎలాంటి ఆర్ట్‌నైనా మీ చేతుల్లో వేసుకోవచ్చు. కొమ్మలు, రెమ్మలే కాదు ముద్దుగొలిపే మకరందపు మందారపువ్వులను కూడా గోళ్లపై పూయించుకోవచ్చు. చూపరుల నుండి ప్రశంసలు పొందేయెుచ్చు. నిమిషాల్లో నెయిల్ ఆర్ట్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం.
ముందుగా నెయిల్స్ శుభ్రం చేసుకుని షేప్ చేసుకోవాలి. తరువాత నెయిల్స్ అన్నింటికి వైట్ కలర్ అప్లై చేసుకోవాలి. తరువాత సన్నని బ్రష్ తీసుకుని లైట్ పింక్ కలర్ లేదా మెచ్చిన కలర్‌తో మందార పువ్వులు రేకులు వేసుకోవాలి. ఇప్పుడు కాస్త డార్క్ పింక్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకుని సన్నని బ్రష్‌తో ఇంతకు ముందు వేసిన లైట్ పింక్ మందార పూలరేకులతో హైలెట్ చేసుకోవాలి.
తరువాత ఎల్లో కలర్ నెయిల్ పాలిష్ తీసుకుని మందార పువ్వుపైన మూడు చిన్న చిన్న చుక్కలు పెట్టుకుని వాటిపై రెడ్ కలర్ నెయిల్ కలర్ చుక్కలు పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని నెయిల్స్‌కి మందార పువ్వులు, ఆకులను డిజైన్ వేసుకుంటే సూపర్ లుక్ వస్తుంది.