బేబీ కార్న్‌లో లో-కేలోరీలుంటాయి. తద్వారా తేలికగా జీర్ణమవుతాయి. బ్రోకోలీ, క్యాలీఫ్లవర్, గ్రీన్ బీన్స్ కంటే బేబీ కార్న్‌లో లో క్యాలరీలుంటాయి. బేబీ కార్న్ తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. బేబీ కార్న్ మంచి రుచిని ఇవ్వడమే కాదు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వంద గ్రాముల బేబీ కార్న్ తింటే కేవలం 26 క్యాలరీలు మాత్రమే వస్తాయి. అందువల్ల ఇది బరువు తగ్గాలనుకునే వారికి మేలైన ఆహారంగా పనిచేస్తుంది.
ఇంకా బేబీ కార్న్‌లో ఫైబర్ పుష్కలంగా వుంటుంది. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. అందువల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. బేబీ కార్న్‌లో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. తద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
అలాగే బేబీ కార్న్‌లో కెరోటినాయిడ్స్ అనబడే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి దృష్టి సంబంధ సమస్యలను దూరం చేస్తాయి. నేత్ర సమస్యలు ఉన్నవారు బేబీ కార్న్‌ను తరచూ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీంతోపాటు కంటి శుక్లాలు రాకుండా ఉంటాయి. ఫోలేట్ అనే పోషక పదార్థం బేబీ కార్న్‌లో పుష్కలంగా ఉంటుంది. ఇది గర్భిణీలకు మేలు చేస్తుంది. శిశువు ఎదుగుదలకు సహాయపడుతుంది. అందుకే గర్భిణీ మహిళలు బేబీకార్న్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.