కొబ్బరి నీటితో మసాజ్ చేసుకోండి.. నలుపుకు చెక్ పెట్టండి..!
బుధవారం, 25 మే 2016 (15:30 IST)
చిన్నపిల్లల మేనిఛాయ తక్కువగా ఉందని తల్లిదండ్రులు బాధపడుతుంటారు. దీనినుంచి విముక్తి పొందాలంటే పసితనం నుంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరి... అవేంటో ఇప్పుడు చూద్దాం..
స్నానం దగ్గర మనం తీసుకునే జాగ్రత్తలు పిల్లల మేనిఛాయ మెరిసిపోయేందుకు ఉపయోగపడుతుంది. స్నానానికి ముందు నలుగు పెట్టి స్నానం చేయించడం వల్ల చర్మకాంతి రెట్టింపవుతుంది.
తేనె తీసుకోవడం కూడా మేనిఛాయకు నిగారింపు లభిస్తుంది. తేనెలో ఉండే విటమిన్ బి కాంప్లెక్స్ చర్మం రంగును మెరిపించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది.
కొబ్బరి నీటితో ముఖం, శరీరాన్ని మర్దనం చేయడం వల్ల మంచి రంగు వస్తుంది. పిల్లలు ఎండలో వెళ్లినపుడు సన్‌స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా రాసుకునేలా జాగ్రత్త పడాలి.
నిమ్మరసంలో ఉండే విటమిన్-సి రంగు మెరుగుపరిచేందుకు తోడ్పడుతుంది. పిల్లలకు నిమ్మరసం కలిపిన నీటిని అప్పుడప్పుడూ తాగించడం వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది.
ఒక చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ పాలపొడి, రెండు టేబుల్ స్పూన్ల తేనె, సగం నిమ్మకాయ రసం కలిపి మిశ్రమంగా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే ముఖంపై పేరుకుపోయిన దుమ్ము తొలిగిపోతుంది.