మన చుట్టూ సూక్ష్మజీవులైన అనేక రకాలయిన బ్యాక్టీరియా వుంటుంది. మన చుట్టూనే కాదు, మన చర్మం పైన, నోట్లో, గొంతులో, మన జీర్ణవ్యవస్థ పొడవునా కోటానుకోట్ల సూక్ష్మజీవులు నివాసం వుంటాయి. ఇలా మన జీర్ణవ్యవస్థలో వుండే బ్యాక్టీరియా మన ఆహారం జీర్ణం కావడానికి ఉపయోగపడటంతో పాటు కొన్ని రకాల వ్యాధుల నుంచి రక్షిస్తాయి.