చల్లని వాతావరణంలో వేడివేడిగా పకోడీలు తింటే? ఎన్ని కేలరీలు వస్తాయి?

మంగళవారం, 24 నవంబరు 2020 (22:30 IST)
వాతావరణం చల్లబడినప్పుడు పకోడీలు తింటుంటే ఆ రుచే వేరు. పకోడాలను బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, కాలీఫ్లవర్ వంటి వివిధ కూరగాయలతో తయారు చేస్తారు. ఒక ప్లేటు పకోడాలో 315 కేలరీల వరకు ఉంటాయి. ఆ కేలరీల ఇలా వుంటాయి.
 
కార్బోహైడ్రేట్లు - 100 కేలరీలు
ప్రోటీన్ - 29 కేలరీలు
కొవ్వులు - 186 కేలరీలు.
కనుక మొత్తం 315 కేలరీలన్నమాట. సగటును రోజుకి ఓ మనిషికి(పెద్దవారికి) సుమారు 2,000 కేలరీలు అవసరమైతే, ఒక చిరుతిండి వడ్డింపుతో ఏకంగా 315 కేలరీలు వచ్చేస్తే ఇక మిగిలినవాటి పరిస్థితి చెప్పక్కర్లేదు. అవసరానికి మించి కేలరీలు వచ్చి చేరతాయి. అందుకే ఇలాంటి చిరుతిళ్లను అధిక కేలరీలు లేకుండా రుచికరంగా చేసుకునే విధానాలను పాటించాలి.
 
పకోడాలు లేదా వడలను తక్కువ క్యాలరీలు వుండేట్లు ఎలా చేయాలి?
పకోడాలలో గరిష్ట కేలరీలు కొవ్వుల నుండి, అవి డీప్ ఫ్రైయింగ్ నుండి పొందబడతాయి. కాబట్టి, దాని క్యాలరీ కంటెంట్‌ను తగ్గించడానికి ఆ దశను వదిలివేయడానికి ఒక మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఎక్కువ నూనె లేకుండా, పకోడాలను వేయించడానికి ఎయిర్ ఫ్రైయర్‌ను ఉపయోగించవచ్చు.

అల్పాహారానికి ఎక్కువ పోషకాహారం జోడించడానికి బచ్చలికూర, కాలీఫ్లవర్ వంటి ఆరోగ్యకరమైన కూరగాయలను వాడవచ్చు. అల్పాహారం యొక్క పోషక విలువను మెరుగుపరచడానికి కొత్తిమీర, మిరపకాయలతో చేసిన ఇంట్లో పచ్చడితో వడలు లేదా పకోడాలను తినేందుకు ప్రయత్నించాలి. ఇలా చేస్తే అదనపు కేలరీలు శరీరంలోకి చేరకుండా వుంటాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు