డెంగ్యూ, మలేరియా, గున్యా, వంటి వ్యాధులు వెంటాడుతున్నాయా? అయితే మీ ఇంటి ఆవరణలో బంతిపూల మొక్కలు పెంచితే ఈ వ్యాధి కారక దోమలు దరిచేరవట. ప్రస్తుతం ఈ విషయంపై బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ) లోతుగా అధ్యయనం చేస్తుంది.
దోమల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వీటి నియంత్రణకు కొత్త మార్గాలను అన్వేషించాలని డీబీటీకి శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ, పర్యావరణం, అటవీ సంబంధింత అంశాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది.