తండ్రి మృతదేహం వద్దే ప్రియురాలి మెడలో తాళికట్టిన యువకుడు (Video)

ఠాగూర్

ఆదివారం, 20 ఏప్రియల్ 2025 (09:59 IST)
తన తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ యువకుడు తన ప్రియురాలి మెడలో మృతదేహం వద్దే తాళికట్టాడు. ఈ విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో జరిగింది. 
 
ఈ జిల్లాలోని కవణై అనే ప్రాంతానికి చెందిన సెల్వరాజ్ అనే రైల్వే ఉద్యోగి మృతి చెందాడు. ఆయన రెండో కుమారుడు అప్పు అనే యువకుడు న్యాయశాస్త్రం  అభ్యసిస్తున్నాడు. డిగ్రీ చదువుతున్న విజయశాంతి అనే అనే యువతిని ప్రేమించాడు. ఈ క్రమంలో తన తండ్రి ఆకస్మికంగా మృతి చెందడంతో  తన తండ్రి మృతదేహం వద్దే పెళ్ళి చేసుకోవాలని అప్పు నిర్ణయించాడు. 
 
దీనికి వధువు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా సమ్మతం తెలిపారు. దీంతో అంత్యక్రియలకు వచ్చిన బంధువుల సమక్షంలోనే తన ప్రియురాలి మెడలో అప్పు పసుపుతాడు కట్టి ఆ యువతిని తన అర్థాంగిగా చేసుకున్నాడు. ఆ తర్వాత తండ్రి భౌతికకాయానికి నమస్కరించి ఆశీస్సులు పొందారు. దీంతో ఆ ఇంటిలో ఒకవైపు దుఃఖం, మరోవైపు సంతోషం నెలకొంది. 

 

తండ్రి మృతదేహం ఎదుట వివాహం చేసుకున్న కుమారుడు

తమిళనాడులోని కడలూరు జిల్లా కవణ్ణైలో రైల్వే ఉద్యోగి సెల్వరాజ్ అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన రెండో కుమారుడు న్యాయ విద్యార్థి అప్పు, డీగ్రీ విద్యార్థిణి విజయశాంతితో గత మూడు సంవత్సరాలుగా ప్రేమయాణం. ఇరు కుటుంబాలతో వివాహం చేసుకోవాలని… pic.twitter.com/JzuuyHuEvt

— ChotaNews App (@ChotaNewsApp) April 19, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు