పొట్లకాయలో ఉన్న పోషకాలు ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చదవండి. పొట్లకాయ కూర, పచ్చడి అంటే లాగించేస్తుంటాం. బరువు తగ్గాలనుకునేవారు పొట్లకాయ తీసుకుంటే ఎంతో మేలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పొట్లకాయలో కెలోరీలూ, కొవ్వు శాతం చాలా తక్కువ. పీచు అధికంగా ఉంటుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ పనితీరు బాగుంటుంది. శరీర జీవక్రియల శాతం మెరుగుపడుతుంది.
మధుమేహం ఉన్నవారికే ఇదెంతో మేలు చేస్తుంది. వంద గ్రాముల పొట్లకాయ ముక్కల్లో క్యాల్షియం, ఫాస్పరస్, ఇనుము, కెరొటిన్ వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి గుండెకు మేలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పొట్లకాయను తరచూ తీసుకోవడం ద్వారా శరీరంలో ద్రవాల శాతం తగినంతగా ఉంటుంది. దీంతో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంతో పొట్లకాయ కీలకపాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.