గ్రిల్‌ వంటకాలు.. అతిగా తినొద్దు..

ఆదివారం, 1 జులై 2018 (13:24 IST)
గ్రిల్‌‌లో చేసే ఆహారాన్ని అతిగా తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గ్రిల్‌లో పొగ పట్టకుండా చూసుకోవాలి. ఆహారాన్ని గ్రిల్ చేసే సమయాన్ని తగ్గించాలి. గ్రిల్ చేసేటప్పుడు మాంసం నుంచి రసం కారి బొగ్గు మీద లేదా బాగా వేడిగా ఉన్న ఉపరితలం మీద పడి పొగ వస్తుంది.


ఈ పొగలో పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్లు (పిఎహెచ్) ఉంటాయి. విడుదలైన పొగ గ్రిల్ చేస్తున్న ఆహారానికి పట్టుకుంటుంది. దాని కార్సినోజెన్లు గ్రిల్ చేస్తున్న ఆహారానికి అంటుకుపోయి తిన్నప్పుడు శరీరంలోకి చేరిపోతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  
 
మాంసంలో కొవ్వు ఎక్కువగా ఉన్న భాగాన్ని గ్రిల్ చేసేటప్పుడు పొగ వస్తుంది. అందుకని దాన్ని నివారించేందుకు మాంసం నుంచి కొవ్వు తొలగించాలి. లేదా నిమ్మరసం, వెనిగర్ వంటి వాటిలో మాంసాన్ని నానపెట్టాలి. ఇలా నానపెట్టినప్పుడు మాంసం ఉపరితలం నుంచి కార్సినోజెన్లు విడుదలవ్వవు.

గ్రిల్ చేసే పదార్థాన్ని ఎక్కువసార్లు కదుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల గ్రిల్ చేస్తున్న పదార్థం నుంచి ద్రవాలు కారకుండా నివారించొచ్చు. కబాబ్‌లు, చిన్న మాంసం ముక్కల్ని గ్రిల్ చేసే సమయాన్ని వీలైనంత తగ్గించాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు