వర్షాకాలంలో ఆరోగ్యంగా వుండాలంటే.. ఈ జాగ్రత్తలు పాటించాలి. ఆహారం వండటానికి ముందు, తినడానికి ముందు, తప్పనిసరిగా చేతుల్ని శుభ్రంగా కడగాలి. ఫలితంగా సూక్ష్మక్రిముల వ్యాప్తిని నివారించవచ్చు.
వంటకు, తాగడానికి పరిశుభ్రమైన నీటిని, ఆహార పదార్థాలను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పచ్చిపండ్లు, కూరగాయలు, ఉడికించని మాంసంపై హానికరమైన సూక్ష్మక్రిములు ఉండవచ్చు. వీటిని శుభ్రంగా కడగడం, చెక్కుతీయడం వల్ల సూక్ష్మక్రిములను తొలగించవచ్చు.
కాలపరిమితి దాటిన ఆహార పదార్థాలను తినకూడదు. సమయానుసారం భోజనం చేయాలి. రాత్రి త్వరగా భోజనం చేసేయాలి. భోజనానికి, నిద్రకు కనీసం రెండు గంటల సమయం ఉండాలి. రాత్రి త్వరగా నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.