రాజ్మా, బొబ్బర్లను కూరల్లో వాడుకుంటే.. లేదంటే ఉడికించి సాయంత్రం పూట స్నాక్స్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. బొబ్బర్లను ఉడికించి గుగ్గిళ్లుగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి తగిన పోషకాలు అందుతాయి. వీటిలో ప్రొటీన్లు, పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్ ఎ, బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్-కె, విటమిన్-సి, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, సోడియం, జింక్ వంటి ఖనిజ లవణాలు అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వవు.
అలాగే రాజ్మా కూరల్లోనూ, సూప్స్ తయారీలోనూ, ఇతర వంటకాల్లోనూ వాడతారు. రాజ్మాలో ప్రొటీన్లు, పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్-బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్-ఇ, విటమిన్-కె, విటమిన్-సి, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, జింక్, సోడియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.